తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-27T07:56:09+05:30 IST

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
చింతపల్లి మండల కేంద్రంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర, ప్రజా ప్రతినిధులు

చింతపల్లి, సెప్టెంబరు 26: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు గార్డెన్‌లో  మహిళలకు బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులు అందజేసి మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ కంకనాల ప్రవీణవెంకట్‌రెడ్డి, ఎంపీపీ కొండూరు భవానీ పవన్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా నేతలు నట్వ గిరిధర్‌, అండేకార్‌ అశోక్‌, కొప్పుల రాములు గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్య క్షుడు గున్‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి,  ఉజ్జిని విద్యాసాగర్‌రావు, మండల పంచాయతీ అధికారి వెంకన్న, సర్పంచ్‌లు వింజమూరు రవి, డి.లలితబాయి మోహన్‌, సుమతిరెడ్డి, ఎంపీటీసీలు ఎల్లంకి వరలక్ష్మీఅశోక్‌, కుంభం శ్వేత శ్రీశైలంగౌడ్‌, పలు వురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 

మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి

పెద్దవూర, నాగార్జునసాగర్‌:మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. పెద్దవూర మండలంలోని పెద్దగూడెం, సిరసనగండ్ల, లింగంపల్లి, తెప్పలమడుగు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. సాగర్‌లోని ఫైలాన్‌ కాలనీలో బస్‌స్టేషన్‌ ఆవరణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, ఎంపీ డీవో డి.శ్యాం, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుంటుక వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవినాయక్‌, గజ్జల లింగారెడ్డి, సర్పంచ్‌లు కూన్‌రెడ్డి మల్లారెడ్డి, కర్ణ అనూషశరత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రఘువీర్‌ పాల్గొన్నారు.

హాలియా: అనుముల మండలం హాజారీగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అధ్వర్యంలో బతు కమ్మ చీరలను అనుముల మండల ఎంపీపీ సుమతిపురుషోత్తం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫొరం అధ్యక్షుడు రాం బాబుయాదవ్‌, కుంటిగొర్ల పాపయ్యయాదవ్‌, జలీల్‌,  పాల్గొన్నారు. 

అడవిదేవులపల్లి: మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను  ఎంపీపీ ధనావత్‌ బాలాజీనాయక్‌, జడ్పీటీసీ కుర్ర సేవ్యానా యక్‌లు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కూరాకుల మల్లేశ్వరి గోపినాథ్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీను, ఎంపీటీసీ కుర్ర కాంతికృష్ణ, సర్పంచ్‌ కుర్ర సుజాత, ఎంపీడీవో కార్యాలయ సూప రింటెండెంట్‌ అమీర్‌అలీ, నాయకులు రవి, శ్రీను, బాలు పాల్గొన్నారు.


Read more