తెలంగాణ సాయుధ పోరాటం దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-17T06:24:31+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాటం దేశానికే ఆదర్శమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికయుగేందర్‌రావు, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటం దేశానికే ఆదర్శం
తుంగతుర్తిలో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ గుజ్జ దీపికయుగేంధర్‌రావు

జిల్లా వ్యాప్తంగా జాతీయ సమైక్యతా ర్యాలీలు

పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, సెప్టెంబరు 16 : తెలంగాణ సాయుధ పోరాటం దేశానికే ఆదర్శమని  జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికయుగేందర్‌రావు, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం తుంగతుర్తిలో జాతీయ సమైక్యతా ర్యాలీతో సభా స్థలానికి చేరుకుని వారు మాట్లాడారు. ప్రపంచానికే సాయుధ పోరాటం నేర్పిన ఘనత తుంగతుర్తి గడ్డదని అన్నారు.  నిజాం నవాబు పాలనలో  ఒక రూపాయికి 17 డాలర్లు వచ్చేవని, నేడు బీజేపీ పాలనలో ఒక డాలరుకు రూ.80లు విలువ ఉందని  విమర్శించారు.  తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ పాత్ర లేదన్నారు. గతంలో గుజరాత్‌ రాష్ట్రం నుంచి బహిష్కరింపబడిన అమిత్‌షా నేడు దేశ హోంమంత్రి కావడం విచారకరమన్నారు.   బీజేపీ నాయకులు మతవిద్వే షాలు రెచ్చగొట్టి అభివృద్ధిని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నా రని, తెలంగాణ ప్రజలు సమైక్యంగా ఉండి సీఎం కేసీఆర్‌కు మద్దతు ఇవ్వా లని కోరారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, డీఎస్పీ నాగ భూషణం, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ రజాక్‌, ఎంపీపీ కవిత రాములుగౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ సైదులు, తిరుమలగిరి మునిసిపల్‌ చైర్మన్‌ రజిని, తహసీల్దార్‌ రాంప్రాసాద్‌, ఎంపీడీవో భీంసింగ్‌ పాల్గొన్నారు.


Read more