శాలిగౌరారం మార్కెట్‌ కమిటీ చైర్మనగా తేజస్వి

ABN , First Publish Date - 2022-10-02T06:25:55+05:30 IST

శాలిగౌరారం మార్కెట్‌ కమిటీ నూతన పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జా రీ చేసింది.

శాలిగౌరారం మార్కెట్‌ కమిటీ చైర్మనగా తేజస్వి
మామాడి తేజశ్వి

వైస్‌ చైర్మనగా శేఖర్‌బాబు నియామకం 

శాలిగౌరారం, అక్టోబరు 1: శాలిగౌరారం మార్కెట్‌ కమిటీ నూతన పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జా రీ చేసింది. శాలిగౌరారం వ్యవసా య మార్కెట్‌ కమిటీ చైర్మనగా మండలంలోని మాదారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మామిడి సర్వ య్య కుమార్తె మామిడి తేజశ్వి, వైస్‌ చైర్మనగా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన గుజలాల్‌ శేఖర్‌బాబు నియమితులయ్యారు. డైరెక్టర్లుగా సామ చంద్రారెడ్డి (రామాంజపురం), కారింగుల పాండు(ఆకారం), సకినాల నర్సయ్య (వంగమర్తి), శేషరాజుపల్లి వెంకన్న (ఇటుకులపాడు), కల్లెట్లపల్లి వీరయ్య (పెర్కకొండారం), అంకర్ల సత్తయ్య (మనిమద్దె), పుట్ట భద్రయ్య (గురజాల), వంగూరి మ ల్లేష్‌ (చిత్తలూరు), కొల్లు సత్తిరెడ్డి (వల్లాల), దండ నర్సిరెడ్డి (బైరవునిబండ), తానం జోజిరెడ్డి (వంగమర్తి), బెల్ద రమేష్‌ (నకిరేకల్‌), అదేవిధంగా శాలిగౌరా రం పీఏసీఎస్‌ చైర్మన తాలూరి మురళి, శాలిగౌరారం సర్పంచ భట్ట హరితవీరబాబు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. 

Read more