తహసీల్దార్‌ కార్యాలయాలకు తాళం..విధుల అడ్డగింత

ABN , First Publish Date - 2022-10-11T06:15:08+05:30 IST

సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు భువనగిరి తహసీల్దార్‌ కార్యాలయ ప్రధాన గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు.

తహసీల్దార్‌ కార్యాలయాలకు తాళం..విధుల అడ్డగింత
మోత్కూరులో వీఆర్‌ఏలను అరెస్టుచేస్తున్న పోలీసులు

 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

 78వ రోజుకు వీఆర్‌ఏల సమ్మె

 ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌: సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు భువనగిరి తహసీల్దార్‌ కార్యాలయ ప్రధాన గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు చింతల పెంటయ్య మాట్లాడుతూ పే స్కేలు అమలు చేయాలని శాంతియుతంగా 78రోజుల పాటు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంసరికాదన్నారు. వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వీఆర్‌ఏలు తహసీల్దార్‌ కార్యాలయాన్ని దిగ్బంధించడంతో వివిధ రెవెన్యూ పనులపై కార్యాలయానికి వచ్చే రైతులు, సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తహసీల్దార్‌ హామీతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య, అర్జున, మాధవరెడ్డి, కుమార్‌, రాజు, చంద్రయ్య, సత్తయ్య, శివ, ప్రేమ్‌, జాని, గణేశ, సుదర్శన, మల్లేశ, శ్రీశైలం, నవనీత ఉన్నారు. వలిగొండలో నిర్వహించిన కార్యక్రమంలో వీఆర్‌ఏలు స్వామి, భిక్షపతి, సాయిమల్లు, అంజయ్య, ఎల్లయ్య, యూసుఫ్‌, నర్సింహ, మల్లేష్‌, నారాయణ, నాగరాజు పాల్గొన్నారు. తుర్కపల్లిలో వీఆర్‌ఏలు రెండు గంటల పాటు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో తహసీల్దార్‌తోపాటు కార్యాలయం సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లకుండా బయటనే నిరీక్షించారు. సమస్యను ప్రభుత్వం తీసుకెళ్తానని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం జిల్లా కో కన్వీనర్‌ కోట నర్సంహ, సంఘం అధ్యక్షకార్యదర్శులు కోట ఆంజనేయులు, ఉప్పరి బాల్‌నర్సింహ, వీఆర్‌ఏలు ఎద్దు రాజశేఖర్‌, రమేశ, వీరస్వామి  పాల్గొన్నారు. మోత్కూరులో వీఆర్‌ఏలను అరెస్టు చేసి బలవంతంగా పోలీ్‌సస్టేషనకు తరలించారు. కొంత సేపటి తర్వాత వ్యక్తిగత పూచీపై వదిలిపెట్టారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల జేఏసీ జిల్లా కోకన్వీనర్లు ఎ.సైదులు, ఎం.రవి, సిహెచ.మాధవి, మండల అధ్యక్షుడు సూరారం యాదయ్య, శ్రీకాంత, యాకు, పరశురాములు, శ్రీను, నూర్‌, ఉమ, కిరణ్‌, కిషోర్‌ పాల్గొన్నారు. మోటకొండూరులో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు అనిల్‌, వీఆర్‌ఏలు మశ్చేందర్‌, నరేందర్‌, గణేశ, సుకన్య, అం డాలు, కవిత, సరస్వతి, పరమేశ, మొగులయ్య, పరుశురాములు ఉన్నారు.  బొమ్మలరామారంలో  తహసీల్దార్‌ కార్యాలయం గేటుకు తాళం వేసి, వీఆర్‌ఏలే ఆందోళన చేపట్టారు. అడ్డగూడూరులో నిర్వహించిన కార్యక్రమంలో జేఏసీ చైర్మన దాసరి వీరన్న, వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు మేకల యాదగిరి, ఉపాధ్యక్షుడు బందెల వీరస్వామి, ప్రధానకార్యదర్శి బాలస్వామి పాల్గొన్నారు. ఆత్మకూరు(ఎం)లో నిర్వహించిన కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం జిల్లా నాయకుడు ఆడెపు బిక్షపతి, మండల అధ్యక్ష కార్యదర్శులు నర్సింహ్మ, ఐలయ్య, మల్లయ్య, బక్కమ్మ, శంకరయ్య, శేఖర్‌రెడ్డి, అనిత పాల్గొన్నారు. భూదానపోచంపల్లిలో వీఆర్‌ఏల సమ్మెకు బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్‌ నల్ల లక్ష్మణ్‌ మాదిగ డిమాండ్‌ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో   బైరు రామాంజనేయులుగౌడ్‌, నాయకులు ముసునూరి యాదగిరి, తండ వెంకటే్‌షగౌడ్‌, జోగు శ్రీనివాస్‌, భారత భూషణ్‌, కుక్క బాల్‌నర్సింహ, చిట్టిపోలు శ్రీనివాస్‌, పగడాల శివ, వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు ఊషయ్య, మల్లేష్‌, నర్సింహ, రామకృష్ణ, మల్లేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-10-11T06:15:08+05:30 IST