టీచర్లు అంకితభావంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-12-13T01:23:27+05:30 IST

అంగన్‌వాడీ టీచర్లు అంకిత భావంతో పనిచేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలుగా ఎంపికైన వారికి సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ్లారు.

 టీచర్లు అంకితభావంతో పనిచేయాలి
అంగన్‌వాడీ టీచర్‌కు నియామకపత్రాన్ని ఇస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌, డిసెంబరు 12: అంగన్‌వాడీ టీచర్లు అంకిత భావంతో పనిచేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. నియోజకవర్గంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలుగా ఎంపికైన వారికి సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ్లారు. కార్యక్రమంలో సీడీపీవో విజయలక్ష్మి, జడ్పీటీసి కొప్పుల సైదిరెడ్డి, పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్‌, పార్వతి కొండా నాయక్‌, చావా వీరభద్రరావు, ఉపేందర్‌యాదవ్‌,పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. పట్టణం, మండలంలోని ప్రభుత్వ పాఠశా లలకు మంజూరైన సైన్స్‌ పరికరాలను ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్‌పై ఉపాధ్యాయులు ఆసక్తి పెంచి ఉన్నతులుగా తీర్చిదిద్దాల న్నారు. కార్యక్రమంలో కొప్పుల సైదిరెడ్డి, గుజ్జుల సుజాత అంజిరెడ్డి, సలీమా రంజాన్‌, విజయలక్ష్మి, కాశమ్మ, అమర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:23:27+05:30 IST

Read more