ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలి

ABN , First Publish Date - 2022-09-14T05:27:25+05:30 IST

ఉపాధ్యాయు లు సమయ పాలన పాటించాలని కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ అన్నారు. మండల పరిధిలోని వెలిదండ, కీతవారిగూడెం గ్రామాల లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం సందర్శించారు.

ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలి
కీతవారిగూడెంలోని అంగన్‌వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌

కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌

గరిడేపల్లి, సెప్టెంబరు 13: ఉపాధ్యాయు లు సమయ పాలన పాటించాలని కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ అన్నారు. మండల పరిధిలోని వెలిదండ, కీతవారిగూడెం గ్రామాల లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వెలిదండ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, హాజరుశాతం తదితర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన విద్య అందుతుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పలు సూచన లు చేశారు. దీంతో పాటు ఉపాధి హామీ పనుల ను ఆయన తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి పంచాయతీ కార్యదర్శిని పనుల వివరాలు, మస్టర్‌ రికార్డుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కీతవారిగూడెంలోని అంగన్‌వాడీకేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి పిల్లల నమోదు సంఖ్యను అంగన్‌వాడీ పరిస్థితులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆదూరి పద్మ కోటయ్య, కీత జ్యోతి రామారావు, తహసీల్దార్‌ కార్తీక్‌, ఎంపీడీవో వనజ, ఇన్‌చార్జి ఎంపీవో భద్ర య్య, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ రాజ్యలక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి పెండెం ధనమూర్తి అంగన్‌వాడీ టీచర్‌ సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-14T05:27:25+05:30 IST