కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-02-19T06:28:53+05:30 IST

కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో పీఏసీఎస్‌, మార్క్‌ఫెడ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు

కొనుగోలు కేంద్రాన్ని  సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జానయ్యయాదవ్‌, లలిత

సూర్యాపేట సిటీ, ఫిబ్రవరి 18 : కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో పీఏసీఎస్‌, మార్క్‌ఫెడ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని వారు శుక్రవారం ప్రారంభించి, మాట్లాడారు. రైతులు నాణ్యమైన కందులు తీసుకువచ్చి మద్దతు ధర రూ.6,300 పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్‌ అధికారి శ్రీధర్‌, మార్కెట్‌ కార్యదర్శి ఫసియోద్ధిన్‌, అసిస్టెంట్‌ కార్యదర్శి పుష్పలత, మార్క్‌ఫెడ్‌ సూపర్‌వైజర్‌ దేవేందర్‌, పీఏసీఎస్‌ సీఈవో శ్రీనివాస్‌, యూడీసీ ఖాసీం, శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-19T06:28:53+05:30 IST