ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-11T06:35:28+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి, ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ చిట్టిపాక రాములు శనివారం కోరారు. సూర్యాపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో స్టేట్‌ సర్వీసెస్‌, బ్యాంకింగ్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట(కలెక్టరేట్‌), సెప్టెంబరు 10: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి, ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ చిట్టిపాక రాములు శనివారం కోరారు. సూర్యాపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో స్టేట్‌ సర్వీసెస్‌, బ్యాంకింగ్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదే విధంగా ఏదైనా డిగ్రీ, బీటెక్‌, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. దరఖాస్తులను ఈ నెల 24వ తేదీలోపు సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి అక్టోబరు 2వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రవేశపరీక్ష సూర్యాపేటలో నిర్వహించి, మెరిట్‌ ప్రకారం వంద మందిని ఎంపిక చేస్తామన్నారు. వారికి ఈ నెల 19 నుంచి 2023, మార్చి 18వ తేదీ వరకు ఐదు నెలల పాటు ఉచిత భోజన, వసతి కల్పించి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.  వివరాలకు సెల్‌ నంబర్‌ 9989129935లో సంప్రదించాలన్నారు.

Read more