TS news: అప్పుల బాధతో టీచర్ ఆత్మహత్య...అంత్యక్రియలను అడ్డుకున్న రుణదాతలు

ABN , First Publish Date - 2022-08-12T19:39:22+05:30 IST

జిల్లాలోని మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

TS news: అప్పుల బాధతో టీచర్ ఆత్మహత్య...అంత్యక్రియలను అడ్డుకున్న రుణదాతలు

సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో  ఉద్రిక్తత కొనసాగుతోంది. అప్పుల బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు (government teacher) గోదేశి నరేంద్రబాబు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి పొద్దుపోయాక సూర్యాపేటలోని తన ఇంట్లో  నరేంద్రబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే స్వగ్రామమైన రాఘవపురంలో అంత్యక్రియలు జరగకుండా రుణదాతలు అడ్డుకున్నారు. దీంతో  నిన్నటి నుండి ఆందోళన కొనసాగుతోంది. నరేంద్రబాబు సుమారు రూ.20 కోట్లు అప్పుచేసినట్టు ప్రచారం జరుగుతోంది. తాము ఇచ్చిన డబ్బులు ఇచ్చేంత వరకు అంత్యక్రియలు జరిగేది లేదని రుణదాతలు స్పష్టం చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 

Read more