అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తాం

ABN , First Publish Date - 2022-09-10T06:40:15+05:30 IST

అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.

అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తాం
మేళ్లచెర్వులో పింఛన్‌దారులతో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

మేళ్లచెర్వు, సెప్టెంబరు 9: అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.  శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.  మండల వ్యాప్తంగా 1296, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 11వేల పింఛన్లు కొత్తగా మంజూరయ్యాయని తెలి పారు.  కార్యక్రమంలో ఎంపీడీవో ఇసాక్‌ హుస్సేన్‌, ఎంపీపీ కొట్టె పద్మసైదేశ్వరరావు, జడ్పీటీసీ పద్మ గోవిందరెడ్డి,  సర్పంచ్‌ శంకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం 

హుజూర్‌నగర్‌: సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీలకు చెందిన లబ్ధిదా రులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌  చెక్కులను శుక్రవారం పట్ట ణంలోని టౌన్‌హాల్‌లో ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.  కార్య క్రమంలో మునిసిపల్‌ చైర్మన్లు గెల్లి అర్చన రవి, జయబాబు, వైస్‌ చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

మఠంపల్లి: మండల వ్యాప్తంగా పలువురికి మంజూరైన సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీపీ ముడావత్‌ పార్వతి, జడ్పీటీసీ జగన్‌ నాయక్‌, ఇరుగు పిచ్చయ్య పింపిణీ చేశారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌నాయక్‌, లక్ష్మీవెంకటనారా యణ, లక్ష్మీనరసింహారాజు తదితరులు పాల్గొన్నారు. Read more