శంభులింగేశ్వరుడిని తాకిన సూర్యకిరణాలు

ABN , First Publish Date - 2022-09-17T06:15:32+05:30 IST

మేళ్లచెర్వు మండల కేంద్రంలోని స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి మూలవిరాట్‌ను శుక్రవారం ఉదయం 7.30 గంటలకు సూ

శంభులింగేశ్వరుడిని తాకిన సూర్యకిరణాలు
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

మేళ్లచెర్వు, సెప్టెంబరు 16 : మేళ్లచెర్వు మండల కేంద్రంలోని స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి మూలవిరాట్‌ను శుక్రవారం ఉదయం 7.30 గంటలకు సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏడాది సెప్టెంబరు రెండో చివరి వారంలో తాకే సూర్యకిరణాలు ఈ ఏడాది వారం ముందుగానే తాకాయని, సూర్యుడు సింహ లగ్నంలోకి ప్రవేశించినప్పుడు ఈ విధంగా జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు శివ విష్ణువర్ధన్‌శర్మ తెలిపారు. కార్తీకమాసం వరకు ఈ కిరణాలు నిత్యం తాకుతాయని తెలిపారు. ఈ సమయంలో స్వామివారికి దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని ఆయన వివరించారు. 


Read more