అభిమంత్రణతో సుదర్శనహోమం

ABN , First Publish Date - 2022-09-25T06:08:49+05:30 IST

మట్టపల్లి నృసింహుడి సన్నిధిలో పవిత్రోత్సవాల్లో భాగం గా శనివారం అభిమంత్రణతో సుదర్శనహోమం, యంత్రస్థాపన శాస్ర్తోక్తంగా నిర్వహించా రు. హోమాది క్రతువుల నిర్వహణకోసం అగ్నిమథనంతో వచ్చిన జ్వాలలను సంగ్రహంచి యాగ కుండలాలలో ఆవాహనంచేశారు.

అభిమంత్రణతో సుదర్శనహోమం
పవిత్రోత్సవాల్లో భాగంగా మట్టపల్లి క్షేత్రంలో సుదర్శన హోమం నిర్వహిస్తున్న అర్చకులు

 మట్టపల్లిలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు 

మఠంపల్లి, సెప్టెంబరు 24: మట్టపల్లి నృసింహుడి సన్నిధిలో పవిత్రోత్సవాల్లో భాగం గా శనివారం అభిమంత్రణతో సుదర్శనహోమం, యంత్రస్థాపన శాస్ర్తోక్తంగా నిర్వహించా రు. హోమాది క్రతువుల నిర్వహణకోసం అగ్నిమథనంతో వచ్చిన జ్వాలలను సంగ్రహంచి యాగ కుండలాలలో ఆవాహనంచేశారు. వాస్తుపూజ, పంచగవ్య ప్రోక్షణలు అనంతరం హోమ పవిత్రాల శుద్ధి నిర్వహించారు. రాత్రి అగ్నిధ్యానం, పంచశయ్యాధివాసాలు, అష్టమంగళ పంచాయుధ స్థాపన చేశారు. రామాయణాధి ఇతిహాస ప్రవచనాల నివేదనల అనంత రం నీరాజన మంత్ర పుష్పం తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. రాత్రి 7గంటలకు అగ్నిధ్యా నం, ద్వాదశ సూక్తపఠనం, సుదర్శన యంత్రస్థాపన, అష్టమంగళ పంచాయుధస్థాపన తదితర కార్యక్రమాలను యాజ్ఠీకులు బొర్రా వాసుదేవశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కా ర్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్‌, అర్చకు లు తుమాటి శ్రీనివాసాచార్యులు, కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, రామాచార్యులు, లక్ష్మణచార్యులు, బ్రహ్మచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.  

Read more