విద్యార్థులు మంచిని గ్రహించాలి
ABN , First Publish Date - 2022-09-08T06:30:17+05:30 IST
విద్యార్ధులు మంచిని గ్రహించి జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలాసత్పథి కోరారు. బుధవారం రాజాపేట మండలం నెమిల ఉన్నత పాఠశాలలో సురక్షిత బాల్యంపై స్నేహిత అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ, మత్తు పదార్థాలు తదితర 13అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

కలెక్టర్ పమేలాసత్పథి
రాజాపేట, సెప్టెంబరు 7: విద్యార్ధులు మంచిని గ్రహించి జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలాసత్పథి కోరారు. బుధవారం రాజాపేట మండలం నెమిల ఉన్నత పాఠశాలలో సురక్షిత బాల్యంపై స్నేహిత అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ, మత్తు పదార్థాలు తదితర 13అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక మాద్యమా ల్లో మంచి, చెడు రెండూ ఉంటాయని, మంచిని గ్రహించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివా్‌సరెడ్డి, అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, సర్పంచ్ మమతా రమేష్, మండల ప్రత్యేక అధికారి జైపాల్‌రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఎంపీడీవో రామరాజు, తహసీల్దార్ గిరిధర్, ఎంఈవో మాధవి, అండాలు, సైదులు, డాక్టర్ భరత్‌కుమార్, బుగ్గారెడ్డి, శోభా తదితరులు పాల్గొన్నారు.