కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-11-03T01:08:04+05:30 IST

ఎన్నిల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు.

కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్‌

మర్రిగూడ, నవంబరు 2 : ఎన్నిల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. మండలంలోని శివన్నగూడలోని జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. మండలంలో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మండలంలో 28,730 మంది ఓటర్లు ఉన్నారని, 20 గ్రామపంచాయతీల పరిధిలో 33 ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో 720 మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కరెంటు, మంచినీటి వసతి, ఓటర్లు ఓటు వేయడానికి వారికి అవసరమైన విధంగా సదుపాయాలు ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోకతప్పదన్నారు. ఓటర్లు తన ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు సహకరించాలని కోరారు. ఈయన వెంట ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మర్రిగూడ తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి, బషీర్‌ పలువురు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-11-03T01:08:04+05:30 IST
Read more