రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-11-12T01:11:21+05:30 IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచియాయని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పాలకవీడు మండలంలోని రావిపహాడ్‌ గ్రామంలోని గంగాభవానిపురంలో రూ.20లక్షలతో నిర్మించే సీసీరోడ్డు, డ్రైనేజీ పనులకు శుక్రవారం ఆయన ప్రారంభిరంచారు. అనంతరం టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

పాలకవీడు, నవంబరు 11: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచియాయని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పాలకవీడు మండలంలోని రావిపహాడ్‌ గ్రామంలోని గంగాభవానిపురంలో రూ.20లక్షలతో నిర్మించే సీసీరోడ్డు, డ్రైనేజీ పనులకు శుక్రవారం ఆయన ప్రారంభిరంచారు. అనంతరం టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పాలకవీడు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానన్నారు. రైతులకు ప్రతీ ఎకరాకి నీరు అందించాలని రూ.173 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిం చినట్లు తెలిపారు. అనంతరం గుడుగుంట్లపాలెంలో డెయిరీ ఫాంను పరీశీ లించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అంజిరెడ్డి, దర్గారావు, వెంకట్‌రెడ్డి, సైదులు, కోటిరెడ్డి, రామారావు, శేషు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

హుజూర్‌నగర్‌:జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా మహసభకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల చివరి వారంలో నిర్వహించే జిల్లా మహసభకు తనవంతు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోలా నాగేశ్వరరావు, సీనియర్‌ జర్నలిస్టులు నరేందర్‌రెడ్డి, శేషంరాజు, టీవీఎల్‌, , పిల్లలమర్రి శ్రీనివాస్‌, జానీపాషా, రాంరెడ్డి, రామనాథం రామప్రసాద్‌, అంజయ్య, దయాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, భాస్కర్‌పాల్గొన్నారు.

ఆజాద్‌ చిత్రపటానికి నివాళి

పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రెహనాబేగం, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ జక్కులనాగేశ్వరరావు, ఆస్మానజీర్‌, మంగమ్మ, విజయ్‌, సువర్ణ, నాగకల్యాణి, జానిబేగం తదితరులు పాల్గొన్నారు.

ఫపట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనవిజ్ధాన వేదిక ఆద్వర్యంలో నిర్వహించనున్న జిల్లా చెకుముఖ్‌ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రమేష్‌బాబు, జాఫర్‌, నారాయణరెడ్డి, పివి దుర్గాప్రసాద్‌, జక్కుల వెంకటేశ్వర్లు, అప్పిరెడ్డి,సైదులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నేరేడుచర్ల: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం నేరేడుచర్లలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాయలంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరక్టర్‌ దొండపాటి అప్పిరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ చందమళ్ల జయబాబు, వైస్‌ చైర్మన్‌ చల్లా శ్రీలతారెడ్డి, వైస్‌ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, అరిబండి సురేష్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T01:11:25+05:30 IST