నేటి నుంచి రాష్ట్రస్థాయి యోగా పోటీలు

ABN , First Publish Date - 2022-09-26T06:12:20+05:30 IST

తెలంగాణ యోగాస న స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ (టీవైఎ్‌సఏ) ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి యోగాసన పోటీలను నిర్వహిస్తున్నట్లు టీవైఎ్‌సఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వందనపు కృపాకర్‌, పోటీ ల ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ బోయపల్లి కృష్ణారెడ్డి తెలిపారు.

నేటి నుంచి రాష్ట్రస్థాయి యోగా పోటీలు
సమావేశంలో మాట్లాడుతున్న అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వందనపు కృపాకర్‌

టీవైఎ్‌సఏ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహణ 

నల్లగొండ, సెప్టెంబరు 25: తెలంగాణ యోగాస న స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ (టీవైఎ్‌సఏ) ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి యోగాసన పోటీలను నిర్వహిస్తున్నట్లు టీవైఎ్‌సఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వందనపు కృపాకర్‌, పోటీ ల ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ బోయపల్లి కృష్ణారెడ్డి తెలిపారు. నల్లగొండ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్లగొండ చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 400మంది బాల, బాలికలు ఈ యోగా పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇక్కడ ఎంపికైన వారు వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. తమ సంస్థకు మాత్రమే గుర్తింపు ఉందని, ఈ సంస్థ నుంచి ఇచ్చిన సర్టిఫికెట్లు, పతకాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. స్పోర్ట్స్‌ కోటాకు కూడా తమ సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్‌ చెల్లుబాటు అవుతుందని తెలిపారు. శిక్షణ పొందిన 100 మంది యోగాసన అభ్యాసకుల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Read more