హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: టీడీపీ

ABN , First Publish Date - 2022-03-04T06:19:50+05:30 IST

ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. మండల కేంద్రంలో గురువారం టీడీపీ నాయ కులు కొల్లు నర్సయ్య, అమరారపు శ్రీమన్నారాయణలను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని, మద్యం ఏరులై పారుతోందన్నారు.

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: టీడీపీ

చిలుకూరు, మార్చి 3:ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  బక్కని నర్సింహులు అన్నారు. మండల కేంద్రంలో గురువారం టీడీపీ  నాయ కులు కొల్లు నర్సయ్య, అమరారపు శ్రీమన్నారాయణలను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య  తీవ్రమైందని, మద్యం ఏరులై పారుతోందన్నారు. ఇసుక మాఫియా, భూ మాఫియా ఆగడాలు పెరిగాయన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నంబూరి సూర్యం, రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి ప్రభాకర్‌, మండల అధ్యక్షుడు సాతులూరి గురవయ్య, కొండా సోమయ్య, ఉప్పగండ్ల శ్రీను, కొల్లు సత్యనారాయణ, బడే సాహెబ్‌, కొండా లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. Read more