క్రీడలు దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి

ABN , First Publish Date - 2022-11-25T00:52:03+05:30 IST

దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని నల్లగొం డ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

క్రీడలు దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి
విద్యార్థులతో కలిసి చెస్‌ ఆడుతున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

నల్లగొండ/ నల్లగొండ టౌన్‌/ కనగల్‌, నవంబరు 24: దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని నల్లగొం డ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్‌ స్టేడియం లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడలను ప్రా రంభించి మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వాలూ ఇవ్వని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.3016 పింఛన్‌ ఇస్తూ గౌరవిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ సుభద్ర, డీఎస్‌ డీవో మగ్బుల్‌ అహ్మద్‌, వయోవృద్థుల అధికార నాగిరెడ్డి, స్కూ ల్‌ గేమ్స్‌ కార్యదర్శి వాసుదేవ్‌రావు, సుజాత, శ్రీధర్‌రావు, శ్రీనివాస్‌ పా ల్గొన్నారు. అనంతరం పానగల్‌ వద్ద జరుగుతున్న అభివృద్థి పనులను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని మైనార్టీ రెసి డెన్షియల్‌ స్కూల్‌లో జరిగిన మౌలానా అబ్దుల్‌కలాం ఆజాద్‌ జయం తిలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గంధవారిగూడెంలోని సాంఘీక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల జోనల్‌స్ధాయి సైన్స్‌ఫెయిర్‌ను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఏడు జిల్లాల నుంచి 57పాఠశాలల విద్యార్థులు నమూనాలు ప్రదర్శించారు. కార్యక్ర మంలో సాంఘీక సంక్షమ శాఖ గురుకులాల అకడమిక్‌ జాయింట్‌ సెక్రటరీ శారద, ఆర్‌ీసీవో హెచ్‌ అరుణాకుమారి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి వైస్‌చైర్మన్‌ అబ్బగోని రమేస్‌గౌడ్‌, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్‌, మారగోని భవానిప్రసాద్‌, అలివేలు పాల్గొన్నారు. కనగల్‌ మైలసముద్రం చెరువు, జీఎడవల్లి పాతచెరువులో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చేప పిల్లలు విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాష, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:52:03+05:30 IST

Read more