ఆధ్యాత్మికత విలసిల్లాలి

ABN , First Publish Date - 2022-10-01T06:08:01+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆధ్యాత్మికతతో విలసిల్లాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. శుక్రవారం ఆయన నృసింహుడి పుణ్యక్షేత్రాన్ని సతీసమేతంగా దర్శించుకున్నారు.

ఆధ్యాత్మికత విలసిల్లాలి
గుట్ట ఆలయంలో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌

టీటీడీ తరహాలో ఏర్పాట్లు చేయాలి

ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు

యాదగిరీశుడికి మొక్కు చెల్లింపు 

విమాన గోపురం బంగారు తాపడానికి రూ.52,48,097 విరాళం చెక్కు అందజేత 


యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆధ్యాత్మికతతో విలసిల్లాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. శుక్రవారం ఆయన నృసింహుడి పుణ్యక్షేత్రాన్ని సతీసమేతంగా దర్శించుకున్నారు. విమానగోపురం బంగారు తాపడానికి కిలో 16గ్రాముల బంగారానికి రూ.52,48,097 చెక్కురూపంలో విరాళం అందజేశారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గుట్ట పనుల పురోగతిపై సూచనలు చేశారు. 



సీఎం కేసీఆర్‌ ఉదయం 10.50గంటలకు హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి యా దగిరిగుట్టకు ఉదయం 11.50కు చేరుకున్నారు. కాన్వాయ్‌లో నే యాదగిరికొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి యాదగిరిపల్లి శివారులోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు చేరుకున్నారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ విల్లాలో ప్రజాప్రతినిధులు వైటీడీఏ, రెవె న్యూ, దేవస్థాన అధికారులతో కలిసి ఆలయ విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రపంచ స్థాయి ఆఽధ్యాత్మిక, పర్యాటక పుణ్యక్షేత్రం గా రూపుదిద్దుకుంటున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వా మి దివ్య సన్నిధిని దర్శించుకునేందకు వచ్చే భక్తుల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టీటీడీ తరహాలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్షేత్ర సందర్శన కు విచ్చేసిన భక్తులు గర్భాలయంలోని స్వయంభు పాంచనా రసింహుడిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టాలన్నా రు. దేవస్థానానికి అనుబంధంగా నిర్మిస్తున్న కట్టడాలు పూర్తిగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేపట్టాలన్నారు. యాదగిరి కొండపై ఉన్న విధంగానే టెంపుల్‌ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం పూర్తిగా ఆధ్యాత్మికతకు ఆలవాలంగా, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా పవిత్రమైన భావన భక్తజనుల్లో కలిగే విధంగా ఉండాలన్నారు. 

ఆదాయ పన్నుల అనుమతులు తీసుకోవాలి

యాదగిరిగుట్టక్షేత్రంలో చేపట్టేందుకు ముందుకొచ్చిన దాతలు ఇచ్చే విరాళాలు ఆదాయ పన్ను మినహాయింపు చట్టం 80జీ అనుమతులు వెంటనే తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణ పనులు ఒక ప్రణాళికాబద్దంగా, ఆలయ వైభవాన్ని ప్రతిబించేలా చేపట్టాలన్నారు. యాదగిరిక్షేత్రంలో హెలీప్యాడ్‌ల నిర్మాణం చేపట్టాలని, సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. యాదగిరికొండకు సమీపంలోని వచ్చే ప్రైవేటు నిర్మాణాలకు సునిశితంగా పరిశీలించిన తర్వాతే అనుమతులివ్వాలని వైటీడీఏ అధికారులకు ఆదేశిలిచ్చారు. ఆలయ ఆదాయం, ఖర్చుల నిర్వహణకోసం పారదర్శకంగా ఆడిటింగ్‌ వ్యవస్థ ఉండాలన్నారు. కాగా హైదరాబాద్‌లోని మినీ శిల్పారామం తరహాలో  ఒక సెమినార్‌ హాల్‌, స్టేజీ, వైడ్‌ స్ర్కీన్‌ ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.  

ఇప్పటివరకు 7.877కిలోల బంగారం 

గుట్ట లక్ష్మీనరసింహస్వామి విమానగోపురం బంగారు తా పడానికి విరాళాలు సేకరిస్తున్నట్లు గతేడాది అక్టోబరు 19వ తేదీన కేసీఆర్‌ ప్రకటించారు. ఇదే సమావేశంలో సీఎం కేసీఆర్‌ తన కుటుంబం నుంచి కిలో 16గ్రాముల బంగారం విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. నాటి నుంచి శుక్రవారం వరకు భక్తులు స్వామివారి విమాన గోపురం బంగారు తాపడానికి విరివిగా విరాళాలను వివిధ రూపంలో సమర్పించా రు. ముడి బంగారం రూపంలో 7.877కిలోల బంగారం సమకూరినట్టు, చెక్కులు, నగదు, ఆన్‌లైన్‌ ద్వారా రూ.23,99, 72,230 విమానగోపురం బంగారు తాపడం ఖాతాలో జమయినట్లు దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. 

గుట్టలో పోలీసుల ఆంక్షలు

యాదగిరిగుట్ట రూరల్‌: సీఎం పర్యటన నేపథ్యంలో గుట్టలో శుక్రవారం ఉదయం నుంచి ఆంక్షలు విధించారు. సీఎం వచ్చే మార్గంలో శ్రీరాంనగర్‌ నుంచి గుట్ట ఆలయ సింహద్వారం వరకు దుకాణాలను పోలీసులు మూయించారు. రాచకొండ కమిషనర్‌ మహేష్‌ ఎం.భగవత్‌ ఆధ్వర్యంలో డీసీపీ కే.నారాయణరెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.  నలుగురు డీసీపీలు, 30మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 120మంది ఎస్‌ఐలతో పాటు సుమారు 1300 మంది కానిస్టేబుళ్లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులు

భువనగిరి రూరల్‌: సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ను రాయిగిరి వద్ద అడ్డుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులు యత్నించగా పోలీసులు వారిని నిలువరించి అరె్‌స్టచేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బాధితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా కొంత ఉద్రిక్తత ఏర్పడింది. మహిళలని కూడా చూడకుండా పురుష పోలీసులే వారిని బలవంతంగా పోలీసుల వాహనం ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు రాయిగిరి నుంచి కమాన్‌, పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దుకాణాలను బలవంతంగా మూయించారు. పీసీసీ సభ్యుడు తంగెళ్లపల్లి రవికుమార్‌తోపాటు పలువురు బాధితులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాగా, సీఎం కాన్వాయ్‌ రాయిగిరికు చేరుకునే 5నిమిషాల ముందు ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులు ప్లెక్సీ, ప్లకార్డులతో ఒక్కసారిగా దూసుకువచ్చారు. అప్పటికే అక్కడ భద్రత నిర్వహిస్తున్న భువనగిరి రూరల్‌ సీఐ వెంకటేశ్‌, ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌, సిబ్బంది వారిని అడ్డుకొని అరె్‌స్టచేశారు. 


సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక విందు

యాదగిరివాసుడి క్షేత్ర సందర్శనకు విచ్చేసిన కేసీఆర్‌కు తెలంగాణ హరితా టూరి జం ఆధ్వర్యంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌కు అందించిన లంచ్‌ మెనూలో టమాటా పప్పు, పాలకూర పప్పు, దమ్‌ బేండీ, టమాట మునగకాయ కూర, బోడకాకరకాయ, కా కారకాయ ఫ్రై, బీన్స్‌ ఫ్రై, భగార రైస్‌, వైట్‌ రైస్‌, సాంబార్‌, సేమియా పాయసం, గులాబ్‌ జా మ్‌ వంటకాలను ప్రత్యేకంగా తయా రు చేసి భోజనంలో అందజేశారు.


సీఎం కేసీఆర్‌ పర్యటన సాగిందిలా..

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ఆలయానికి రోడ్డు మార్గన ఉదయం 11.50గంటలకు వచ్చిన సీఎం కేసీఆర్‌ సాయంత్రం 4.30గంటలకు తిరిగి వెళ్లారు. యాదగిరీశుడి క్షేత్రంలో సుమారు 3గంటల 40నిముషాల పాటు సీఎం కేసీఆర్‌ గడిపారు.

ఉదయం 11.50గంటలకు ప్రగతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌లో రోడ్డు మార్గన యాదగిరిగుట్ట పట్టణ ప్రధాన రహదారి మీదుగా వైకుంఠద్వారం వద్దకు చేరుకున్నారు.

11.52కు గండిచెరువు రింగ్‌సర్కిల్‌ వద్దకు కాన్వాయ్‌ చేరుకుంది.  8 11.55కు రింగురోడ్డు గుండా కాన్వాయ్‌లో గిరిప్రదక్షిణ చేశారు.

మధ్యాహ్నం 12.01గంటలకు గిరిప్రదక్షిణ అనంతరం రింగ్‌సర్కిల్‌ వద్దకు చేరుకున్నారు.

12.05కు ప్రెసిడెన్షియల్‌ సూట్‌ వద్దకు చేరుకుని వైటీడీఏ, అధికారులతో సమీక్షా నిర్వహించారు.

1.43కు సమీక్ష అనంతరం కేసీఆర్‌ కుటుంబసమేతంగా ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నుంచి బయల్దేరారు.

1.54కు కొండపైన పడమటి దిశలోని లిఫ్ట్‌ వద్దకు కాన్వాయ్‌ చేరుకోగా, లిఫ్టు రూమ్‌లోనే చెక్కుపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు.

2.05కు ప్రధానాలయ తూర్పు పంచతల రాజగోపురం వద్దకు చేరుకోగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం తెలిపారు.

2.07కు తూర్పు ఈశాన్య త్రితల రాజగోపురం నుంచి ప్రధానాలయంలోనికి ప్రవేశించారు.

2.10కు ముఖమండపంలోని ఽధ్వజస్తంభానికి, బలిపీఠానికి ప్రదక్షిణ చేశారు.

2.12కు స్వయంభువు కొలువైన గర్భాలయంలోనికి కుటుంబసభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.

2.23కుగర్భాలయం నుంచి ముఖమండపంలోనికి వచ్చారు.

2.40కు విమానగోపురం బంగారు తాపడం కోసం విరాళం చెక్కును ఈవో గీతారెడ్డికి సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాంశు అందజేశారు. అనంతరం వేదపండితులు చతుర్వేదాశీర్వచనం చేశారు.

3.01కు ప్రధానాలయంలోని క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

3.03గంటలకు ఆలయ తూర్పు రాజగోపురం నుంచి బయటికి వచ్చి తాత్కాలిక బాలాలయం తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. 

3.10కు పడమటి దిశలోని లిఫ్ట్‌ వద్దకు చేరుకొని కొండకిందికి వెళ్లారు.

3.36కు సీఎం కేసీఆర్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు చేరుకుని భోజనం చేశారు.

సాయంత్రం 4.30గంటలకు రింగ్‌సర్కిల్‌ మీదుగా కేసీఆర్‌ కాన్వాయ్‌లో హైదరాబాద్‌ పయనమయ్యారు.

Updated Date - 2022-10-01T06:08:01+05:30 IST