హరిహరులకు విశేష పూజలు

ABN , First Publish Date - 2022-06-07T06:17:26+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం లో హరిహరులకు విశేష పూజలు సోమవారం వైభవంగా కొనసాగాయి.

హరిహరులకు విశేష పూజలు
తిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, జూన్‌6: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం లో హరిహరులకు విశేష పూజలు సోమవారం వైభవంగా కొనసాగాయి. శ్రీవె ౖష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో లక్ష్మీనృసింహుడికి శైవాగమ పద్ధతిలో శివాల యంలో కొలువుదీరిన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి, స్పటిక రామ లింగేశ్వరుడికి నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు. వేకువజామున సుప్ర భాతంతో స్వామిని మేల్కొలిపిన పూజారులు బిందెతీర్థంతో నిత్యారాధనలు జరి పారు. ప్రధానాలయంలో నిజాభిషేకం, సహస్రనామార్చనలు జరిపిన మండపం లో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుడిని దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి సన్నిధిలో మూల మూర్తులను, ముఖ మండపంలోని స్పటిక మూర్తులను అర్చకస్వాములు వేదమంత్ర పఠనాలు, మం గళవాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించారు. పార్వతీ, పరమే శ్వరుల సషహ్రనామ పఠనాలతో భిల్వపత్రాలతో అర్చనలు జరిపారు. హరిహ రులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు యాత్రాజనులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హుండీల ద్వారా సమర్పించిన కానుకలను కొండపైన హరితాకాటేజ్‌లో మంగళవారం లెక్కించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

భక్తుల సౌకర్యార్థం సూచిక బోర్డులు ఏర్పాటు

స్వామివారి దర్శనాలకు విచ్చేసిన భక్తజనుల సౌకర్యార్థం కొండపైన ఆలయ తిరువీధుల్లో సోమవారం సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆలయ ఉద్ఘాటన అనంతరం యాదగిరిక్షేత్రానికి పెద్దసంఖ్యలో భక్తులు సందర్శిస్తు న్నారు. కొండ పైకి వచ్చిన భక్తులు దైవ దర్శనాలు, ప్రసాదాల కొనుగోలు, దర్శనానంతరం బయటకు వెళ్లేందుకు సూచిక బోర్డులు లేకపోవడంతో ఇబ్బం దులకు గురవు తున్నారు. భక్తుల ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన దేవ స్థాన అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆలయ ఉత్తర తిరువీధిలో లోహపు దర్శన క్యూలైన్‌ బాక్సులకు సూచిక బోర్డులు అమ ర్చారు. కొండపైకి వచ్చిన భక్తులు స్వామివారి ధర్మదర్శనాలు, ప్రత్యేక దర్శనా లకు వెళ్లే దారుల్లో సూచికబోర్డులు ఏర్పాటు చేయనున్నట్టు, క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు దేవ స్థాన ఇన్‌చార్జి ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఆలయ తిరువీధుల్లో కూల్‌ పెయింట్‌ వేయించినట్టు, తిరువీధుల్లో మినరల్‌ వాటర్‌ ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2022-06-07T06:17:26+05:30 IST