త్వరలో ‘ఇంటింటికి ఎమ్మెల్యే’ : భూపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-07-18T06:10:43+05:30 IST

నల్లగొండ పట్టణం లోని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇం టింటికి ఎమ్మెల్యే పేరు తో అతి త్వరలో వార్డు వార్డు, ఇంటింటికి తిరుగుతానని ఎమ్మెల్యే భూ పాల్‌రెడ్డి అన్నారు.

త్వరలో  ‘ఇంటింటికి ఎమ్మెల్యే’ : భూపాల్‌రెడ్డి
పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కంచర్ల

రామగిరి, జూలై 17: నల్లగొండ పట్టణం లోని ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇం టింటికి ఎమ్మెల్యే పేరు తో అతి త్వరలో వార్డు వార్డు, ఇంటింటికి తిరుగుతానని ఎమ్మెల్యే భూ పాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 35 వ వార్డులో సీసీ లింకు రోడ్లను మునిసిపల్‌ చైర్మన సైదిరెడ్డితో కలిసి శంకుస్థాప న చేసి మాట్లాడారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అ న్నారు. సమస్యలు చిన్నవైతే అప్పటికప్పుడే, డబ్బుతో కూడుకున్నవైతే ఏడాదిలో గా పూర్తి చేయిస్తానని అన్నారు. అదేవిధంగా రోడ్డు పనులను నాణ్యతగా ఉండాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గుర్రం ధనలక్ష్మి, బం డారు ప్రసాద్‌, మాదగోని భవాని, నాయకులు యాదగిరి, రాజేందర్‌, చంద్రశేఖ ర్‌, ప్రకాష్‌, నర్సింహ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. Read more