మా సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-10-04T05:39:26+05:30 IST

తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మండలంలోని రామాపురం వద్ద ఉన్న రెయిన్‌ సిమెంట్‌ పరిశ్రమ కాంట్రాక్టు కార్మికులు కోరా

మా సమస్యలు పరిష్కరించండి
హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న రెయిన్‌ కంపెనీ కార్మికులు

మేళ్లచెర్వు, అక్టోబరు 3 : తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మండలంలోని రామాపురం వద్ద ఉన్న రెయిన్‌ సిమెంట్‌ పరిశ్రమ కాంట్రాక్టు కార్మికులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, మేళ్లచెర్వు మండల ఇన్‌చార్జి కీత శ్రీనివాస్‌, జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్‌, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అంబాల నరే్‌షగౌడ్‌, 40 మంది కాంట్రాక్టు వర్కర్లు పాల్గొన్నారు. 


Read more