షార్ట్‌ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సులో పొగలు

ABN , First Publish Date - 2022-12-13T01:27:24+05:30 IST

షార్ట్‌ సర్యూట్‌తో ఆర్టీసీ బస్‌ నుంచి పొగలు రావ టంతో డ్రైవర్‌ అప్రమత్తతతో ముప్పు తప్పింది.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సులో పొగలు
కోదాడ పట్టణంలో మంటలను అదుపు చేస్తున్న స్థానికులు, ఆర్టీసీ డ్రైవర్‌ శివారెడ్డి

కోదాడ, డిసెంబరు 12: షార్ట్‌ సర్యూట్‌తో ఆర్టీసీ బస్‌ నుంచి పొగలు రావ టంతో డ్రైవర్‌ అప్రమత్తతతో ముప్పు తప్పింది. సోమ వారం కోదాడలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమా చారం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు 25 మంది ప్రయాణికులతో వెళుతున్న బీహెచ్‌ఈఎల్‌ డిపోకు చెందిన టీఎస్‌08జడ్‌ 0028 నెంబరు గల ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ఉదయం 11.30గంటల సమ యంలో కోదాడకు చేరుకుంది. ఒక్కసారిగా బస్సులోనుంచి పొగలు రావటంతో గమనించిన డ్రైవర్‌ శివారెడ్డి అప్రమతమై బస్సును కోదాడలోని శ్రీనివాస్‌ థియే టర్‌ ఎదురుగా ప్రధాన రహదారిపై నిలిపివేశాడు. బ్యాటరీ వైర్‌ తగిలి మంటలు మొదలవుతుండటాన్ని గమనించి సమీపంలో ఉన్న హోటల్‌ నుంచి తెచ్చిన నీళ్లు పోసి మంటలు అదుపుచేశాడు. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరొక బస్సులో ప్రయాణికులను విజయ వాడకు పంపారు. బస్సుకు కోదాడ డిపోలో మరమ్మతులు చేసి పంపారు.

Updated Date - 2022-12-13T01:27:24+05:30 IST

Read more