ఒంటరి మహిళలే టార్గెట్‌

ABN , First Publish Date - 2022-09-25T05:59:08+05:30 IST

అతనికి ఒంటరి మహిళలే టార్గెట్‌. ఒంటరిగా కనిపిస్తే ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అవకాశం రాగానే వారి నగదు, ఆభరణాలను తస్కరిస్తుంటాడు.

ఒంటరి మహిళలే టార్గెట్‌
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగేశ్వర్‌రావు

 బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడుతున్న దొంగ అరెస్ట్‌ 

రూ.14 లక్షల విలువ జేసే 27 తులాల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం  

దేవరకొండ, సెప్టెంబరు 24: అతనికి ఒంటరి మహిళలే టార్గెట్‌. ఒంటరిగా కనిపిస్తే ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అవకాశం రాగానే వారి నగదు, ఆభరణాలను తస్కరిస్తుంటాడు. దేవరకొండ డివిజన పరిధిలో రెండు నెలలు గా బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న దొంగను అరెస్ట్‌ చేసినట్లు దే వరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపారు. అతని వద్ద నుంచి 27 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శనివారం దేవరకొండ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దవూర మండలం మల్లెవానికుంటతండాకు చెందిన రమావత రాంబాబు వ్యసనాలకు అలవాటుపడ్డా డు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకొని వారిపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దొంగలిస్తున్నాడు. రెండు నెలలుగా 9దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జూలై 10వ తేదీన గుడిపల్లి మం డలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకటమ్మ అనే మహిళ వ్యవసా య పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా ఘనపురం దారిలో ఏఎమ్మార్పీ కాల్వ వద్ద ద్విచక్రవాహనంపై వచ్చి ఆమెపై దాడి దాడిచేసి మూడు తులాల బంగారు పు స్తెలతాడు దొంగిలించి పరారయ్యాడు. వెంకటమ్మ చోరీ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపి గుడిపల్లి పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గుడిపల్లి పోలీసు లు విచారణ చేపట్టారు. శనివారం రాంబాబు తాను దొంగిలించిన 27తులాల బంగా రు ఆభరణాలను విక్రయించేందుకు హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రాంబాబుపై దేవరకొండ డివిజన పరిధిలోని గుడిపల్లి పోలీ్‌సస్టేషనలో 2, నేరేడుగొమ్ము 1, డిండి 1, గుర్రంపోడు 1, దేవరకొండ 1, పెద్దవూర 3 కేసులు నమోదైనట్లు తెలిపారు. చైనస్నాచింగ్‌కు పాల్పడుతున్న రాంబాబును చాకచక్యంగా పట్టుకొని బంగారం స్వాధీనం చేసుకున్న కొండమల్లేపల్లి సీఐ రవీందర్‌, గుడిపల్లి ఎస్‌ఐ వీరబాబు, హెడ్‌కానిస్టేబు ల్‌ పాపిరెడ్డి, లాలునాయక్‌, ఏడుకొండలు, ఐడీ పార్టీ సిబ్బంది హేమునాయక్‌లను డీఎస్పీ అభినందించారు. 

Read more