పాఠశాలకు షోకాజ్‌ నోటీసు

ABN , First Publish Date - 2022-08-18T05:16:53+05:30 IST

ప్రైవేటు స్కూల్‌ బస్సు కింద పడి విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల గుర్తింపు రద్దుకు జిల్లా విద్యాధికారి నారాయణరెడ్డి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

పాఠశాలకు షోకాజ్‌ నోటీసు

 చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 17 : ప్రైవేటు స్కూల్‌ బస్సు కింద పడి విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల గుర్తింపు రద్దుకు జిల్లా విద్యాధికారి నారాయణరెడ్డి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ నెల 16న చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో పాలకూర్ల తరుణ్‌(7) మల్లికార్జున పాఠశాలలో రెండో తరగతి చదువున్నాడు. పాఠశాల స్కూల్‌ బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా బస్సు చక్రాల కింద పడిచనిపోయాడు. విద్యార్థులను రవా ణా చేసే సమయంలో సహాయకుడు లేకపోవడం, డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినందున పాఠశాల రద్దు కో రుతూ షోకాజ్‌ నోటీసు జారీ చేసిన ట్లు డీఈవో నోటీసులో పేర్కొన్నారు. నిబంధన మేరకు పాఠశాలపై చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు.


Read more