కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాలి

ABN , First Publish Date - 2022-05-30T06:50:55+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సను ఓడించి కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ సభ్యుడు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు పిలుపునిచ్చారు.

కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాలి
మోత్కూరులో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న కాసం వెంకటేశ్వర్లు

ఎయిర్‌ పోర్టు అథారిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు

మోత్కూరు, మే 29: రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సను ఓడించి కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ సభ్యుడు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు పిలుపునిచ్చారు. మోత్కూరులో ఆదివారం నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి కుటుంబ పాలన సాగిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఒక్క రూపాయికి కిలో బియ్యం, గ్రామ పంచాయతీలకు నిధులు, పలు సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుండగా, రాష్ట్రప్రభుత్వం తానే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోందన్నారు. 2017లో బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.258కోట్లు ప్రకటించినా, నేటికీ ఏ కాల్వను పూర్తిచేయలేదన్నారు. మూసీ నీటి ప్రక్షాళన ఏమైందని ప్రశ్నించారు. చేనేత కార్మికుల బతుకులు దయనీయ స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత ఇటీవల మృతి చెందిన కార్యకర్తలకు సంతాప తీర్మానాన్ని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బయ్యని చంద్రశేఖర్‌, రాజకీయ తీర్మానాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య ప్రవేశపెట్టారు. సమావేశంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, గూడూరు నారాయణరెడ్డి, దాసరి మల్లేశం, సుహాసినిరెడ్డి, పాశం భాస్కర్‌, నర్ల నర్సింగరావు, నరేందర్‌, ఉపేందర్‌, కె.నాగార్జునరెడ్డి, గౌరు శ్రీనివాస్‌, బయ్యని రాజు, పి.సోమయ్య, చొల్లేటి నరేష్‌, మహేందర్‌, జగన్మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read more