రోగులకు అందుబాటులో ఉండాలి
ABN , First Publish Date - 2022-09-13T05:53:55+05:30 IST
వైద్య, ఆరోగ్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కోటా చలం అన్నారు. పెన్‌పహాడ్ పీహెచ్సీలో వైద్య సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పెన్‌పహాడ్, సెప్టెంబరు 12 : వైద్య, ఆరోగ్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కోటా చలం అన్నారు. పెన్‌పహాడ్ పీహెచ్సీలో వైద్య సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోగులకు వైద్యసేవలను సకాలంలో అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని సబ్సెంటర్లను డాక్ట ర్లు, హెచ్‌ఈవోలు పర్యవేక్షించాలని, హెచ్‌ఈవోలు సమన్వయం లేకపోవడంతో విధుల్లో అలసత్యం వహించడంతో పెన్‌పహాడ్ పీహెచ్‌సీపై ప్రజలు నమ్మకం కోల్పోయారని ఆయన అన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం ఆస్పత్రి రికార్డులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్ధన్, డాక్టర్లు మణీదీప్, కల్యాణ్, సారిక, బిందు, హారిప్రసాద్, హెచ్‌ఈవో చంద్రశేఖరరాజు, అనంతలక్ష్మీ, శ్రీలక్ష్మీ, సుజాత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.