శోభాయమానం.. దేదీప్యమానం

ABN , First Publish Date - 2022-03-23T05:59:12+05:30 IST

యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు మంగళవారం కన్నుల పండువగా సాగాయి. సుదర్శన యాగం ప్రారంభం కావడంతో వేడుకలకు

శోభాయమానం.. దేదీప్యమానం
ప్రధానాలయంలో వేదపారాయణం చేస్తున్న రుత్వికులు

యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు మంగళవారం కన్నుల పండువగా సాగాయి. సుదర్శన యాగం ప్రారంభం కావడంతో వేడుకలకు మరింత శోభ వచ్చింది. వేదపండితుల పారాయణాలు, హోమాలు, పూజలు ఎక్కడ చూసినా ప్రధానాలయంతో పాటు బాలాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ వేడుకల్లో కలెక్టర్‌ పమేలా సత్పథి పాల్గొన్నారు. 


బంగారు వర్ణం, ఆకాశాన్ని తాకే గోపురం.. విశాలమైన పునాది గోడలపై హరివిల్లుల పదనిసలు.. వెరసి ఆలయ పరిసరాలు ఎన్నడూ లేనంత శోభాయమానంతో వెలుగి పోతున్నాయి.. ప్రధానాలయ రాజ గోపురాల ప్రాంతం బంగారు వర్ణంతో మెరిసి                          పోతోంది. 
Read more