లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-10-12T06:20:30+05:30 IST

పోడు భూముల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి : కలెక్టర్‌
మేళ్లచెర్వులో పర్యటిస్తున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, అధికారులు

మేళ్లచెర్వు, అక్టోబరు 11: పోడు భూముల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని వేపలమాదారం రెవెన్యూ పరిధిలోని పోడుభూములను వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2005కు ముందు సాగు వివరాలు, నివాసముంటున్న వారి వివరాలను తెలుసుకోవాలన్నారు. 1,478 ఎకరాలకు 416 దరఖాస్తులు వచ్చా యని, అటవీ భూమి హద్దులు నిర్ణయించి సాగులో ఉన్న గిరిజనులు, గిరిజనేతరుల వివరాలు నమోదుచేయాలన్నారు. కలెక్టర్‌ వెంట డీఎ్‌ఫవో సతీ్‌షకుమార్‌, ఆర్డీవో వెంకారెడ్డి, ఎంపీడీవో ఇసాక్‌ హుస్సేన్‌, తహసీల్దార్‌ దామోదర్‌రావుతో పాటు చింతలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల తహసీల్దార్లు, స్థానిక సర్పంచ్‌ సునీతాబాలరాజు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు. 

గ్రూప్‌-1 పరీక్షల కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు

సూర్యాపేట(కలెక్టరేట్‌) : జిల్లాలో ఈ నెల 16వ తేదీన నిర్వహించబోయే గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ సందర్భంగా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అభ్యంతరాలను 6281492368కి ఫోన్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు.  

Read more