25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-04-24T06:08:52+05:30 IST

నిల్వ చేసిన 25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

వలిగొండ, ఏప్రిల్‌ 23 : నిల్వ చేసిన 25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను వలిగొండ ఏఎ్‌సఐ శ్యాంసుందర్‌రెడ్డి శనివారం వివరించారు. మండలంలోని అరూరు గ్రామానికి చెందిన కొడితాల కరుణాకర్‌ రైస్‌మిల్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రజాపంపిణీ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు శనివారం రైస్‌మిల్లును తనిఖీ చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 25 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, రామన్నపేట గోదాంకు తరలించారు. రైస్‌మిల్లు యజమాని కొడితాల కరుణాకర్‌కు బియ్యాన్ని విక్రయించిన కేతావత శ్రీను, ఆటోడ్రైవర్‌ వెంకటేశంలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ శ్యాం సుందర్‌రెడ్డి తెలిపారు.

Read more