‘ఉజ్వల’ లబ్ధిదారులకు రెండో సిలిండర్‌ సౌకర్యం

ABN , First Publish Date - 2022-12-10T00:32:43+05:30 IST

ఉజ్వల గ్యాస్‌ సిలిండర్ల లబ్ధిదారులకు మరో సిలిండర్‌ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని హెచపీ గ్యాస్‌ సంస్థ జనరల్‌ మేనేజర్‌ అవినాష్‌ జైన తెలిపారు.

‘ఉజ్వల’ లబ్ధిదారులకు రెండో సిలిండర్‌ సౌకర్యం
ఐదు కిలోల సిలిండర్‌ను అందజేస్తున్న అవినాష్‌జైన

మిర్యాలగూడ, డిసెంబరు 9: ఉజ్వల గ్యాస్‌ సిలిండర్ల లబ్ధిదారులకు మరో సిలిండర్‌ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని హెచపీ గ్యాస్‌ సంస్థ జనరల్‌ మేనేజర్‌ అవినాష్‌ జైన తెలిపారు. స్థానిక గ్యాస్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు రెండో సిలిండర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద మహిళలకు కట్టెల పొయ్యి బాధను తప్పించేందుకు ప్రధానమంత్రి ఉజ్వల వంటగ్యాస్‌ సిలిండర్‌లను మంజూరు చేశారన్నారు. కాగా గ్యాస్‌ అయిపోతే మరో సిలిండర్‌ వచ్చే వరకూ ఇబ్బంది పడకుండా ఐదు కిలోల రెండో సిలిండర్‌ను అందిస్తున్నారని అన్నారు. వంట గ్యాస్‌ వినియోగంపై మహిళలకు ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సేల్స్‌ ఆఫీసర్‌ ప్రతాప్‌, జిల్లా డీలర్లు గోవర్ధనరెడ్డి, చంద్ర, మహిళా లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:32:46+05:30 IST