సాయిబాబా ఆలయ వార్షిక వేడుకలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-30T06:30:36+05:30 IST

చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ 15వ వార్షిక ఉత్సవాలు ఆదివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి.

సాయిబాబా ఆలయ వార్షిక వేడుకలు ప్రారంభం
అనుగ్రహభాషణం చేస్తున్న శ్రీధరస్వామిజీ

చింతపల్లి, మే 29: చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ 15వ వార్షిక ఉత్సవాలు ఆదివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే భక్తులు సాయినాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వాసవి పీఠాధిపతి శ్రీధరస్వామిజీ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ శ్రీరామచరణ్‌శర్మ నేతృత్వంలో విజ్ఞేశ్వరపూజ, స్వస్తిపుణ్యహవచనం, రక్షబంధనం, ధ్వజరోహణం, అంకురార్పణ, మహామండపారాధన, హోమం, మహామంగళహార తి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. తెలుగు రాష్ర్టాలకు చెందిన భక్తులు స్వామివారి పూజల్లో పాల్గొన్నా రు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మంచికంటి ధనుంజయ, కొమిరిశెట్టి వెంకటయ్య, ఊరే కృష్ణయ్య, కుంభం పుల్లారెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more