పర్యాటకుల స్వర్గధామంలా సాగర్‌

ABN , First Publish Date - 2022-10-01T06:12:39+05:30 IST

ప్రపంచ పర్యాటకుల స్వర్గధామంలా నాగార్జునసాగర్‌ మారుతోందని ఓయూ ప్రొఫెసర్‌ ఆర్కే మిశ్రా అన్నారు. సాగర్‌ హిల్‌కాలనీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.

పర్యాటకుల స్వర్గధామంలా సాగర్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్కే మిశ్రా

ఓయూ ప్రొఫెసర్‌ ఆర్కే మిశ్రా

నాగార్జునసాగర్‌, సెప్టెంబరు 30: ప్రపంచ పర్యాటకుల స్వర్గధామంలా నాగార్జునసాగర్‌ మారుతోందని ఓయూ ప్రొఫెసర్‌ ఆర్కే మిశ్రా అన్నారు. సాగర్‌ హిల్‌కాలనీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. సాగర్‌ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండ చారిత్రాత్మక ప్రదేశంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం పర్యాటకుల స్వర్గధామంగా నిలుస్తోందన్నారు. అనంతరం పర్యాటకశాఖ ఎండీ మనోహర్‌, ఆస్ట్రియా దేశానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హరాల్డ్‌ ప్రెడ్‌, ఇటలీకి చెందిన మార్తా ఫ్రిల్‌, స్పెయిన్‌కు చెందిన ఓనాయమ్‌ డ్రీహా ప్రసంగించారు. కార్యక్రమంలో ఓయూ ప్రొఫెసర్లు జానకి కృష్ణ, లక్ష్మీకుమారి, మచ్చేంధర్‌గౌడ్‌, అరుణ, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సుమంత్‌, పర్యాటకశాఖ జీఎం శాంతి సమాదానం, తదితరులు పాల్గొన్నారు. 

బుద్ధవనాన్ని సందర్శించిన తక్షశిల బుద్ధవిహార్‌ సభ్యులు

సాగర్‌ హిల్‌కాలనీలోని బుద్ధవనాన్ని పూణేకు చెందిన తక్షశిల బుద్ధవిహార్‌ సభ్యులు 13మంది శుక్రవారం సందర్శించారు. బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం వారు మహాస్తూపం లోపల ధ్యానం చేశారు. వారికి బుద్ధవనం చరిత్రను పర్యాటకశాఖ గైడ్‌ సత్యనారాయణ వివరించారు.

Updated Date - 2022-10-01T06:12:39+05:30 IST