సాగర్‌ బీసీ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు దరఖాస్తులకు ఆహ్వానం

ABN , First Publish Date - 2022-10-11T06:10:07+05:30 IST

నాగార్జునసాగర్‌లో నూతనంగా ఈ నెల 15వ తేదీన ఏర్పాటు చేయనున్న బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టులకు అ ర్హులైన అభ్యరులు ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకులాల ఆర్‌సీవో షకీనా తెలిపారు.

సాగర్‌ బీసీ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు దరఖాస్తులకు ఆహ్వానం

నాగార్జునసాగర్‌, అక్టోబరు 10:  నాగార్జునసాగర్‌లో నూతనంగా ఈ నెల 15వ తేదీన ఏర్పాటు చేయనున్న బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టులకు అ ర్హులైన అభ్యరులు ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకులాల ఆర్‌సీవో షకీనా తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు లో 55శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి. అంతే కాకుండా నెట్‌, సెట్‌, పీహెచడీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులను డెమో ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు గంటల ప్రకా రం పని చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. వివరాలకు 08680-224566 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. 

Read more