సదరం క్యాంపు షెడ్యుల్‌ విడుదల

ABN , First Publish Date - 2022-10-08T05:47:47+05:30 IST

జిల్లాలోని అర్హులైన శారీరక, మానసిక దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు అక్టోబరు మాస సదరం క్యాంప్‌ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.

సదరం క్యాంపు షెడ్యుల్‌ విడుదల
రైస్‌మిల్లర్లు, హమాలీలతో మాట్లాడుతున్న మార్కెట్‌ చైర్మన రాజేందర్‌రెడ్డి

 


భువనగిరి టౌన, అక్టోబరు 7: జిల్లాలోని అర్హులైన శారీరక, మానసిక దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు అక్టోబరు మాస సదరం క్యాంప్‌ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు భువనగిరిలోని జిల్లా ఆసుపత్రిలో ఈ నెల 15, 29వ తేదీల్లో శారీరక లోపం ఉన్నవారికి, 21న కంటి సంబంధిత, 10న మానసిక రుగ్మత, 11న వినికిడి లోపం ఉన్నవారికి నిర్ధారణ  పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అర్హులైన వారు తగిన ధ్రువీకరణ పత్రాలతో మీసేవా కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. అయితే మోకాళ్లు, పంటి నొప్పులు, వృద్ధాప్యంతో బాధ పడుతున్న వారు, గుండె, కిడ్నీ లివర్‌, క్యాన్సర్‌, తదితర దీర్ఘకాలిక రోగాలు సదరం క్యాంపునకు వర్తించవన్నారు. మీసేవాలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికే ఆయా తేదీల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. స్లాట్‌ బుకింగ్‌ లేకుండా వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించబోమన్నారు. 


Read more