మత్స్యశాఖ జిల్లా అధికారిగా రూపేందర్‌సింగ్‌

ABN , First Publish Date - 2022-08-18T05:20:56+05:30 IST

సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అఽధికారిగా బి.రూపేందర్‌ సింగ్‌ బుధవారం జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

మత్స్యశాఖ జిల్లా అధికారిగా రూపేందర్‌సింగ్‌
రూపేందర్‌ సింగ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్యసూర్యాపేట సిటీ, ఆగస్టు 17: సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అఽధికారిగా బి.రూపేందర్‌ సింగ్‌ బుధవారం జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో మత్స్యశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రూపేందర్‌సింగ్‌ బదిలీపై సూర్యాపేట జిల్లాకు వచ్చాడు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లా మత్స్యశాఖకు ఇనచార్జీ అధికారిగా విధులు నిర్వహించిన నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య బాధ్యతలను రూపేందర్‌ సింగ్‌కు అప్పగించారు. మత్స్యశాఖలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారంకోసం కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మోహనరావును కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది సాయిబాబు, శ్రీరామ్‌, సుమలత, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు. 


Read more