‘గట్టుప్పల’లో రేపటి నుంచి పాలన

ABN , First Publish Date - 2022-10-01T06:14:50+05:30 IST

గట్టుప్పల మండల ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. చండూరు మండలంలోని గట్టుప్పలతోపాటు ఎనిమిది గ్రామాలతో నూతన మండలంగా ఏర్పాటుకావడంతో మండల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. నూతన మండలంలో పరిపాలన కార్యాలయాల ఏర్పాట్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

‘గట్టుప్పల’లో రేపటి నుంచి పాలన
నూతన తహసీల్దార్‌ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న అధికారులు

అక్టోబరు 2న కార్యాలయాలను ప్రారంభించనున్న మంత్రి జగదీష్‌రెడ్డి

చండూరు రూరల్‌, సెప్టెంబరు 30: గట్టుప్పల మండల ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. చండూరు మండలంలోని గట్టుప్పలతోపాటు ఎనిమిది గ్రామాలతో నూతన మండలంగా ఏర్పాటుకావడంతో మండల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. నూతన మండలంలో పరిపాలన కార్యాలయాల ఏర్పాట్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా తహసీల్దారు కార్యాలయం, పోలీస్‌ స్టేషన్లకు భవనాలను ఎంచుకుని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబరు 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అదేరోజు కార్యాలయాలను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ అనుమతించడంతో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాలు జారీచేశారు. కార్యాలయాల ప్రారంభానికి విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి రానున్నారని, కార్యాలయాల ప్రారంభోత్సవం తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని గట్టుప్పల సర్పంచ్‌ ఇడెం రోజా తెలిపారు.


Updated Date - 2022-10-01T06:14:50+05:30 IST