ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2022-09-17T06:20:00+05:30 IST

రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటన సంస్థాన నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామశివారులో శుక్రవారం చోటు చేసుకుంది.

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులు


త్రుటిలో తప్పిన ప్రమాదం 

సంస్థాన నారాయణపురం, సెప్టెంబరు 16: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటన సంస్థాన నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామశివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ నుంచి చౌటుప్పల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు, చౌటుప్పల్‌ నుంచి మునుగోడు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులు కొత్తగూడెం శివారులో ఢీకొన్నాయి. ఒక బస్సుకు డ్రైవర్‌ ప్రాంతంలో స్వల్పంగా ధ్వంసం కాగా, మరో బస్సుకు మధ్య భాగంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని చౌటుప్పల్‌ ప్రభుత్వాసుప్రతికి తరలించారు. 


Read more