వయోవృద్ధులను ఆదరించాలి

ABN , First Publish Date - 2022-09-25T06:11:03+05:30 IST

వయోవృద్ధులను ప్రేమగా ఆదరించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడద్డి అన్నారు

వయోవృద్ధులను ఆదరించాలి
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

నల్లగొండ టౌన్‌, సెప్టెంబరు 24: వయోవృద్ధులను ప్రేమగా ఆదరించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడద్డి అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భం గా శనివారం కలెక్టరేట్‌లో వయోవృద్ధుల దినోత్సవ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. వయోవృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కుటుంబసభ్యులపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రపంచ వయోవృద్ధు ల వారోత్సవాలను శనివారం నుంచి వారం రోజుల పాటు జిల్లాలో నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఆదివారం వయోవృద్ధులకు ఆటల పోటీలను ఉంటాయన్నారు. 26న సాంస్కృతిక కార్యక్రమాలు, 27న జిల్లా అధికారులకు సీనియర్‌ సిటీజన్‌ యాక్ట్‌ 2007పైన అవగాహన, 28న జిల్లాలోని సర్పంచ్‌లకు వయో వృద్ధుల చట్టంపై అవగాహన, 29న ‘అవ్వతాతమ్మల రోజు’ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమ విజయవంతానికి అన్ని ప్రభు త్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో జిల్లా సంక్షేమశాఖ అధికారి సి.సుభద్ర, ఆర్డీవో జగన్నాథరావు, నాగిరెడ్డి, మల్లికార్జున్‌, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.  

Read more