పరిశ్రమ అనుమతి వద్దంటూ తీర్మానం
ABN , First Publish Date - 2022-10-11T06:44:18+05:30 IST
మండలంలోని వాడపల్లి గ్రామ శివారులో సోడియం శాకరిన్ పరిశ్రమకు అనుమతులు మంజూరు చేయవద్దంటూ పం చాయతీ తీర్మానించింది.

కలెక్టర్ కార్యాలయంలో అందజేత
దామరచర్ల, అక్టోబర్ 10: మండలంలోని వాడపల్లి గ్రామ శివారులో సోడియం శాకరిన్ పరిశ్రమకు అనుమతులు మంజూరు చేయవద్దంటూ పం చాయతీ తీర్మానించింది. ఈ మేరకు తీర్మాన ప్రతిని వాడపల్లి పంచాయతీ పాలకవర్గం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అందజేసింది. ఈ సందర్భం గా సర్పంచ్ కొందూటి మాధవిసిద్ధయ్య, వార్డు సభ్యులు మాట్లాడుతూ, ఇటీవ ల నిర్వహించిన గ్రామ సభలో పరిశ్రమ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకించారని, దీంతో నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామసభలో తీర్మానం చేశామన్నారు. పరిశ్రమ ఉత్పత్తులతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణ అనుమతులు మంజూరు చేయవద్దని కోరారు. అనంతరం తీర్మాన కాపీని సంబంధిత కార్యాలయాల్లో అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండి.యూసుఫ్, ఆంగోతు హాతిరాంనాయక్, దారగాని వెంకటేశ్వర్లుగౌడ్, ఉపసర్పంచ్ ఉప్పతల శ్రీనివాస్, ఉప్పతల ఆనంద్, లక్ష్మీకాంతం గుప్త, ఎల్వీఎస్, మారెళ్ల రాంరెడ్డి, నాగునాయక్ తదితరులు పాల్గొన్నారు.