సహకార రంగంలో సంస్కరణలు

ABN , First Publish Date - 2022-12-30T00:45:05+05:30 IST

సహకార వ్యవస్థలో రాష్ట్ర ప్రభు త్వం చేపడుతున్న సంస్కరణలు దేశానికి రోల్డ్‌ మోడల్‌గా నిలుస్తున్నామని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం డీసీసీబీలో పాలకవర్గం సమావేశ అనంతరం పీఏసీఎస్‌, ఎఫ్‌ఎ్‌ససీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

సహకార రంగంలో సంస్కరణలు
సమావేశంలో మాట్లాడుతున్న మహేందర్‌రెడ్డి

నల్లగొండ,డిసెంబరు29: సహకార వ్యవస్థలో రాష్ట్ర ప్రభు త్వం చేపడుతున్న సంస్కరణలు దేశానికి రోల్డ్‌ మోడల్‌గా నిలుస్తున్నామని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం డీసీసీబీలో పాలకవర్గం సమావేశ అనంతరం పీఏసీఎస్‌, ఎఫ్‌ఎ్‌ససీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సహకార ఉద్యోగుల భద్రత కోసం హెచ్‌ఆర్‌ పాలసీని సీఎం కేసీఆర్‌ అమ లు చేశారన్నారు. చైర్మన్ల గౌరవ వేతనం ఇప్పటి వరకు రూ. 1250 ఉండగా, దాన్ని రూ.7500, రూ.15000 వరకు పెంచారన్నా రు. మూడేళ్ల క్రితం బ్యాంకు టర్నోవర్‌ రూ.900కోట్లు ఉంటే తా ను బాధ్యత చేపట్టాక తర్వాత టర్నోవర్‌ రూ.2,030 కోట్లకు చేరిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే డీసీసీబీ, పీఏసీఎస్‌ సిబ్బందికి ప్రతీ నెల 5వ తేదీలోగా వేతనాలు ఇస్తున్నామన్నారు. అదే విధంగా ఉద్యోగాల్లో 25శాతం కోటా కల్పిస్తామన్నారు. అనంతరం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించా రు. అంతకుముందు సహకార ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పీఏసీఎస్‌ చైర్మన్లకు గౌరవ వేతనంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రెండు జీవోలకు పాలకవర్గ సమావేశంలో డీసీసీబీ ఆమో దం తెలిపింది. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, బీఆర్‌ఎ్‌సకేవీ గౌరవ అధ్యక్షుడే రూప్‌సింగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు రమే్‌షబాబు, మోహన్‌రావు, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఆంజనేయులు, శేఖర్‌గౌడ్‌, రమేష్‌, కృష్ణ, శ్రీనివా్‌సరావు, రాజు, శంకర్‌, సాయిరెడ్డి, జంగారెడ్డి, మల్లిఖార్జున్‌, డీసీసీబీ సీఈవో మదన్‌మోహన్‌, వైస్‌చైర్మన్‌ దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:45:05+05:30 IST

Read more