రామాలయం భూములకు కౌలు చెల్లించాలి

ABN , First Publish Date - 2022-06-07T06:49:43+05:30 IST

పట్టణ పరిధిలోని ఫణిగిరి గట్టు శ్రీసీతారామచంద్రస్వామ దేవాలయ భూముల కౌలు చెల్లించాలని ఈవో గుజ్జుల కొండారెడ్డి, పాలకవర్గ సభ్యులు రామిశెట్టి రాము, వెన్నా పద్మారెడ్డి కోరారు. సోమవారం ఆలయ భూముల కౌలు రైతులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.

రామాలయం భూములకు కౌలు చెల్లించాలి

హుజూర్‌నగర్‌ , జూన్‌ 6: పట్టణ పరిధిలోని ఫణిగిరి గట్టు శ్రీసీతారామచంద్రస్వామ దేవాలయ భూముల కౌలు చెల్లించాలని ఈవో  గుజ్జుల కొండారెడ్డి, పాలకవర్గ సభ్యులు రామిశెట్టి రాము, వెన్నా పద్మారెడ్డి కోరారు. సోమవారం ఆలయ భూముల కౌలు రైతులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కాలువ కింద ఉన్న  భూములకు రూ.5వేలు, మోటార్ల ద్వారా సేద్యం చేసే భూములకు రూ.3వేలు, మెట్ట భూములకు రూ.1000ల చొప్పున కౌలు చెల్లించాలన్నారు. హుజూర్‌నగర్‌, గోవిందాపురం, యర్రవరం రైతులు ఇప్పటికే కౌలు చెల్లించారని తెలిపారు. రామలక్ష్మీపురంలో పలువురు రైతులు కౌలు చెల్లించాల్సి ఉందన్నారు కౌలు చెల్లించడంలో జాప్యం చేస్తే బహిరంగ వేలం వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్కా వెంకన్న, వెంకట్‌రెడ్డి, పాపిరెడ్డి, కోటిరెడ్డి, సత్యనారాయణ, పానకాలు, రాములు  పాల్గొన్నారు. 

కోదాడ రూరల్‌: మండలంలోని రామలక్ష్మీపురం శ్రీవేణుగోపాల సీతారామచంద్రస్వామి దేవస్థానం భూములకు ముందుగానే కౌలు చెల్లిం చాలని, లేదంటే బహిరంగ వేలం వేస్తామని ఆలయ ఈవో కొండా రెడ్డి హెచ్చరించారు. ఆలయ భూములు కౌలుదార్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం నాయకులు అన్నెం పాపిరెడ్డి, కొప్పుల వెంకట్‌రెడ్డి, సీతారాంరెడ్డి, పానకాలు  పాల్గొన్నారు.

Updated Date - 2022-06-07T06:49:43+05:30 IST