రామచంద్రారెడ్డితోనే భూదానోద్యమానికి బీజం

ABN , First Publish Date - 2022-07-18T06:05:03+05:30 IST

ప్రఽథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డితోనే భూదానోద్యమానికి బీజం పడిందని తపాలాశాఖ హైదరాబాద్‌ పీఎంజీ (పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌) పి.విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. వెదిరె రామచంద్రారెడ్డి జయంతి సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన పోస్టల్‌ కవర్‌ను హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యాసాగర్‌రెడ్డి, వెదిరె రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో ఆదివారం ఆవిష్కరించారు.

రామచంద్రారెడ్డితోనే భూదానోద్యమానికి బీజం
హైదరాబాద్‌లో వెదిరె రామచంద్రారెడ్డి పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరిస్తున్న పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ విద్యాసాగర్‌రెడ్డి, వెదిరె కుటుంబసభ్యులు

పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణలో పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ విద్యాసాగర్‌రెడ్డి


భూదాన్‌పోచంపల్లి, జూలై 17: ప్రఽథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డితోనే భూదానోద్యమానికి బీజం పడిందని తపాలాశాఖ హైదరాబాద్‌ పీఎంజీ (పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌) పి.విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. వెదిరె రామచంద్రారెడ్డి జయంతి సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన పోస్టల్‌ కవర్‌ను హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యాసాగర్‌రెడ్డి, వెదిరె రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ, 1951 ఏప్రిల్‌ 18న పోచంపల్లిలో వినోబాభావే పర్యటనలో భాగంగా భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి తన 100ఎకరాల భూమిని దానంగా రాసి ఇవ్వడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగిందన్నారు. కార్యక్రమంలో వెదిరె రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు వెదిరె అరవిందారెడ్డి, వెదిరె సాగర్‌రెడ్డి, వెదిరె ప్రమోద్‌ చంద్రారెడ్డి, వెదిరె సుభా్‌షరెడ్డి, నల్లగొండ పోస్టల్‌ సూపరిండెంట్‌ వెంకటసాయి, భువనగిరి ఏఎస్పీ భూమయ్య, పోచంపల్లి పోస్ట్‌మాస్టర్‌ ఏ.శంకర్‌, తదితరులు పాల్గొన్నారు. వెదిరె రామచంద్రారెడ్డి జయంతి సందర్భంగా పోచంపల్లిలోని వినోబామందిరం వద్ద ఆయన కాంస్య విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కొయ్యడ నర్సింహగౌడ్‌, వేశాల మురళి, సార బాలయ్యగౌడ్‌, బండి యాదగిరిగౌడ్‌, గడ్డం బాలరాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-18T06:05:03+05:30 IST