రాజగోపాల్‌రెడ్డి ప్రజల మనిషి కాదు

ABN , First Publish Date - 2022-10-11T06:39:21+05:30 IST

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రజల మనిషి కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని జైకేసారం, నేలపట్ల, మందోళ్లగూడెం, చిన్నకొండూర్‌ గ్రామాల్లో ఆయన ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు.

రాజగోపాల్‌రెడ్డి ప్రజల మనిషి కాదు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం జైకేసారంలో ఉప ఎన్నిక ప్రచారంలో మాట్లాడుతున్న వీరభద్రం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

చౌటుప్పల్‌ రూరల్‌, అక్టోబరు 10: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రజల మనిషి కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని జైకేసారం, నేలపట్ల, మందోళ్లగూడెం, చిన్నకొండూర్‌ గ్రామాల్లో ఆయన ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు గ్రామాలకు వచ్చిన దాఖలాలు లేవని, ఏనాడూ గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. అభివృద్ధి చేయలేకనే రాజీనామా చేస్తునట్టు ప్రకటించాడని గుర్తుచేశారు. ఓడిపోతాననే భయంతో రాజగోపాల్‌రెడ్డి వింతవింతగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మతోన్మాద బీజేపీని మునుగోడులోనే కాదు తెలంగాణలోనూ అడుగుపెట్టనివ్వబోమని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కమ్యునిస్టుల మద్దతుతో మునుగోడులో టీఆర్‌ఎస్‌ భారీ మోజార్టితో గెలుస్తుందని ఽధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, నాయకులు కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, మేక ఆశోక్‌రెడ్డి, గంగాదేవి సైదులు, బూరుగు కృష్ణారెడ్డి, తడక మోహన పాల్గొన్నారు. 

Read more