నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , First Publish Date - 2022-05-24T06:53:11+05:30 IST

భవన నిర్మాణాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి సూచించారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
గ్రంథాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న శ్రీధర్‌రెడ్డి

విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి 

భువనగిరి టౌన్‌, మే 23: భవన నిర్మాణాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి సూచించారు. భువనగిరిలో నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ భవనం, బస్వాపురంలో నిర్మిస్తున్న కేజీబీవీ పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో భవనాల నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత భవనాల నిర్మాణం పూర్తయితే పూర్తిస్థాయి వసతులతో జిల్లా గ్రంథాలయం, కేజీబీవీ పాఠశాల భవనం అందుబాటులోకి వస్తాయన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎన్‌.సుధీర్‌, టీఎ్‌సఈడ్ల్యూడీసీ ఈఈ అనిత, డీఈ శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.  

Read more