గురుకులంలో నాణ్యమైన విద్యనందించాలి

ABN , First Publish Date - 2022-09-10T06:06:00+05:30 IST

గురుకులంలో నాణ్యమైన విద్యనందించాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సంయుక్త కార్యదర్శి సక్రునాయక్‌ అన్నారు.

గురుకులంలో నాణ్యమైన విద్యనందించాలి

మిర్యాలగూడ టౌన్‌, సెస్టెంబరు 9: గురుకులంలో నాణ్యమైన విద్యనందించాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సంయుక్త కార్యదర్శి సక్రునాయక్‌ అన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించి మాట్లాడారు. స్వచ్ఛ గురుకుల్‌ కార్యక్రమంలో గురుకులాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపారు. నాణ్యత, ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు అన్నివసతులు సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశుభ్రత, పచ్చదనం పెంపొందిస్తున్నామన్నారు. అనంతరం హాస్టల్‌, కిచెన్‌, డార్మెటరీలను పరిశీలించి విద్యాలయ ప్రాంగణంలో మొక్క నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రవీంద్రప్రసాద్‌, పీఈటీ గురువయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read more