ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-04-05T06:27:47+05:30 IST

ప్రజవాణిలో ప్ర జల నుంచి వచ్చిన దరఖాస్తులను సత్వరమే ప రిష్కరించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వివి ధ శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
అర్జీలను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నల్లగొండ టౌన, ఏ ప్రిల్‌ 4: ప్రజవాణిలో ప్ర జల నుంచి వచ్చిన దరఖాస్తులను సత్వరమే ప రిష్కరించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వివి ధ శాఖల అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. కలెక్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిర్యాదుదారులు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆ ర్వో జగదీశ్వర్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణి అర్జీలకు ప్రా ధాన్యతనిస్తూ పెండింగ్‌లో లేకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Read more