చికిత్స పొందుతూ మానసిక మహిళా రోగి

ABN , First Publish Date - 2022-04-05T06:20:28+05:30 IST

అధిక మోతాదులో మాత్రలు (మందులు) మింగి ఒక మానసిక మహిళారోగి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది.

చికిత్స పొందుతూ మానసిక మహిళా రోగి

 వలిగొండ, ఏప్రిల్‌ 4: అధిక మోతాదులో మాత్రలు (మందులు) మింగి ఒక మానసిక మహిళారోగి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోకారం గ్రామానికి  చెందిన నోముల గంగయ్య భార్య నోముల పద్మ (48) గత 10 సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధ పడుతోంది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో పద్మకు చికిత్స చేయించారు. ఈ నేపథ్యంలో మార్చి 31న డాక్టర్లు సిఫారసు చేసిన మందులను అధిక మోతాదులో మింగి అపస్మారక స్థితికి వెళ్లింది. గుర్తించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్‌  తెలిపారు.Read more