‘ప్రజావాణి’ దరఖాస్తులకు రశీదులు అందించండి

ABN , First Publish Date - 2022-10-04T05:36:34+05:30 IST

ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే దరఖాస్తులకు రశీదులు అందజేయాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులకు రశీదులు అందించండి
ప్రజావాణిలో దరఖాస్తుదారుడితో మాట్లాడుతున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), అక్టోబరు 3 : ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే దరఖాస్తులకు రశీదులు అందజేయాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, మాట్లాడారు.  దరఖాస్తులను వెంటనే పరిశీలించాలన్నారు. పింఛన్లు, భూసంబంధిత విన్నపాలు, కళాకారుల పింఛన్‌ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. మొత్తం 32 దరఖాస్తులు వచ్చాయని, ప్రజావాణికి రాని అధికారులకు మెమో జారీ చేసి సంజాయిషీ తీసుకోవాలన్నారు. అంతకుముందు సివిల్‌ సప్లయ్‌గోడౌన్‌ 173మంది హమాలీలకు మంజూరైన దసరా బోనస్‌ రూ.10,72,600 చెక్కును వారికి అందజేశారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, జడ్పీ సీఈవో సురేష్‌, సివిల్‌ సప్లయి అధికారి రాంపతి, సీపీవో వెంకటేశ్వర్లు, డీఎ్‌ఫవో సతీ్‌షకుమార్‌, శిరిష, జ్యోతిపద్మ, డీపీవో యాదయ్య, బుర్రి నవీన్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

Read more