నల్లగొండ-కొండమల్లేపల్లి జాతీయ రహదారికి ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2022-09-25T06:12:01+05:30 IST

నల్లగొండ-కొండమల్లేపల్లి రహదారిని జాతీయ రహదారిగా మార్చి విస్తరణ పనులను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు శాసన మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.

నల్లగొండ-కొండమల్లేపల్లి జాతీయ రహదారికి ప్రతిపాదనలు
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

శాసన మండలి చైర్మన్‌గుత్తాసుఖేందర్‌రెడ్డి

కనగల్‌, సెప్టెంబరు 24: నల్లగొండ-కొండమల్లేపల్లి రహదారిని జాతీయ రహదారిగా మార్చి విస్తరణ పనులను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు శాసన మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గలరేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఎంపీ నిధులు రూ.25లక్షల నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను శనివా రం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ-మల్లేపల్లి మధ్యన 60 కి.మీ.ల రహదారిని నేషనల్‌ హైవేగా మార్చాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. జాతీయ రహదారిగా మారితే ఈప్రాంతం అభివృద్ధిలో మరింత ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు.

అమ్మవారు ఎంతో మహిమ గలది 

దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మతల్లి ఎంతో మహిమ గలదని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నాడు అమ్మవారికి నూతన ఆలయంకోసం తాను ఎంపీ గా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కరీంపాష, వైస్‌ ఎంపీపీ శ్రీధర్‌రావు, ఈవో జయరామయ్య, ఆలయ చైర్మన్‌ యాదగిరి, సింగిల్‌విండో చైర్మన్లు సహదేవరెడ్డి, శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాదయ్యగౌడ్‌, మాజీ చైర్మన్‌ కె.గోపాల్‌రెడ్డి, స్వామిగౌడ్‌, పీఆర్‌ డీఈ నాగయ్య, ఏఈ శ్రీనివాస్‌, డీటీ తబిత, ఆర్‌ఐ అర్జున్‌, సర్పంచ్‌లు పూలమ్మ, అంజమ్మరామచంద్రం, ఎంపీటీసీ శైలజసైదులు పాల్గొన్నారు.  అంతకుముందు ఆలయ అర్చకులు, సిబ్బంది పనితీరుపై నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు వేతనాలు తీసుకుంటూ ఆలయ అభివృద్ధికి పాటుపడకుండా సొంత వ్యాపారాలకు ప్రాధాన్యమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వచ్చే భక్తుల మనోభావాలను గౌరవించాలన్నారు.  

Read more